బుధవారం, 16 అక్టోబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By ivr
Last Modified: బుధవారం, 30 మే 2018 (13:29 IST)

ధోనీకి ఐపీఎల్ 2018 కప్ కంటే కూతురే... చూడండి(Video)

చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2018 కప్ గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఐతే కప్ గెలుచుకున్న ఆనందంలో జట్టు ఆటగాళ్లంతా గుమిగూడి సందడి చేస్తుంటే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ మాత్రం తన కుమార్తె పరుగులు తీసుకుంటూ మైదానంలోకి వస్తుంటే ఆమెను ఎత్తుకుని మ

చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2018 కప్ గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఐతే కప్ గెలుచుకున్న ఆనందంలో జట్టు ఆటగాళ్లంతా గుమిగూడి సందడి చేస్తుంటే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ మాత్రం తన కుమార్తె పరుగులు తీసుకుంటూ మైదానంలోకి వస్తుంటే ఆమెను ఎత్తుకుని ముద్దాడారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. 
 
అంతేకాదు.... ధోనీ తన ముద్దులు కుమార్తెకు జట్టు సభ్యులను, కప్‌ను చూపిస్తుంటే ఆమె మాత్రం గ్యాలరీలో కేరింతలు కొడుతున్న అభిమానలను చూపిస్తూ వారికి చేతులు చూపిస్తూ అభినందనలు తెలిపింది. ధోనీ కూడా ఆమెతో పాటు అందరికీ అభివాదం చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది. మీరూ చూడండి.