శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 మే 2023 (22:24 IST)

గుజరాత్ టైటాన్స్ Vs చెన్నై.. సుదర్శన్ సంచలన ఇన్నింగ్స్

sudarsan
sudarsan
ఐపీఎల్ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ టాప్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, తొలుత గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 214 పరుగులు చేసింది. 
 
ఈ మ్యాచ్‌లో యువ బ్యాట్స్ మన్ సాయి సుదర్శన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతుల్లోనే ఫిఫ్టీ నమోదు చేసిన సాయి సుదర్శన్ అక్కడ్నించి రాకెట్ వేగంతో 90ల్లోకి చేరుకున్నాడు. 
 
అతడి స్కోరులో 8 ఫోర్లు, 6 సిక్సులున్నాయి. ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఫీల్డింగ్ నాసిరకంగా ఉండడంతో గుజరాత్ కు ఈజీగా పరుగులు లభించాయి.