ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (11:02 IST)

'దట్‌ నేమ్‌ ఈజ్‌ జాన్‌ సీనా.. మై నేమ్‌ ఈజ్‌ సురేశ్‌ రైనా'

కరోనా వైరస్ కారణంగా ఆర్థాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 14వ సీజన్ పోటీలు ఈ నెల 19వ తేదీ నుంచి తిరిగి ప్రారంభంకానున్నాయి. యూఏఈ వేదికగా జరుగనున్న ఈ పోటీలకు ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇలాంటి వారిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు సురేష్ రైనా ఒకరు. 
 
ఐపీఎల్‌ మలిదశ మ్యాచ్‌ల కోసం ప్రస్తుతం దుబాయ్‌లోని ప్రాక్టీస్‌ సెషన్లలో బిజీగా ఉన్న అతను.. తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టాడు. అందులో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్‌ జాన్‌ సీనా మ్యూజిక్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా, స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద సహచరుడు కేఎమ్‌ ఆసిఫ్‌తో రైనా జాన్‌ సీనా స్టంట్‌ను ప్రదర్శిస్తాడు. 
 
దీనికి 'దట్‌ నేమ్‌ ఈజ్‌ జాన్‌ సీనా.. మై నేమ్‌ ఈజ్‌ సురేశ్‌ రైనా' అని క్యాప్షన్‌ను జోడించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. రైనా అద్భుతంగా స్టంట్‌ను ప్రదర్శించాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.