సోమవారం, 6 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 మే 2023 (14:30 IST)

పోలీస్ ఆఫీసర్‌ను చితకబాదిన సీఎస్కే మహిళా అభిమాని.. కారణం? (video)

CSK Fan
CSK Fan
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వర్షంతో వాయిదాపడిన సంగతి తెలిసిందే. హ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం జరగాల్సింది. 
 
కానీ వర్షంతో ఈ మ్యాచ్ రిజర్వ్ అయ్యింది. దాంతో మెగా ఫైనల్ కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రిజర్వ్ డే అయిన సోమవారం రాత్రి 7.30 గంటలకు ఈ ఫైనల్ పోరు జరుగనుంది. 
 
ఈ మ్యాచ్‌ను చూడటం కోసం వచ్చిన ఓ సీఎస్కే మహిళా అభిమాని.. ఓ పోలీస్ అధికారిని చితకబాదింది. స్టేడియంలో డ్యూటీ చేస్తున్న సదరు పోలీస్ అధికారిని కాలితో తన్నడం కాకుండా పదే పదే నెట్టేసింది. అసలు గొడవకు కారణం ఏంటో తెలియదు కానీ సోషల్ మీడియా వేదికగా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. 
 
వీడియోలో చూస్తే ఆ పోలీస్ ఆఫీసర్ ముందు ఆమె పక్కన కూర్చున్నట్లే కనిపిస్తోంది. పోలీస్ అధికారి తాగిన మత్తులో సదరు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ మహిళా అభిమాని పోలీస్‌పై దేహశుద్ధి చేసిందని కామెంట్ చేస్తున్నారు.