గురువారం, 18 జులై 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 నవంబరు 2022 (13:16 IST)

మనకి మనమే సందేశాలు పంపుకోవచ్చు.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్!

whatsapp
అవును మనకి మనమే సందేశాలను పంపుకునే కొత్త ఫీచర్ వాట్సాప్‌లో వచ్చేసింది. ప్రపంచంలోనే ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ వాట్సాప్‌ని కోట్లాది మంది వాడుతుండడం చూస్తుంటాం. వాట్సాప్ యూజర్ల సౌకర్యానికి తగ్గట్టుగా వాట్సాప్ మేనేజ్‌మెంట్ కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. 
 
వాట్సాప్ కేవలం వినోదం కోసం కాకుండా వ్యాపార ప్రయోజనాల కోసం కమ్యూనికేషన్‌తో పాటు వివిధ మార్గాల్లో ఉపయోగించబడుతుంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ యూజర్లకు ఇటీవలే కొత్త ఫీచర్ల నోటిఫై రావడంతో ఇప్పుడు మనకే సందేశాలు పంపుకునే సదుపాయం కొత్త ఫీచర్‌గా రాబోతోందని వాట్సాప్ యాజమాన్యం తెలిపింది. 
 
అంతే కాకుండా కొన్ని ఫోటోలను బ్లర్ చేసేందుకు బ్లర్ ఫీచర్ కూడా రాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో వాట్సాప్ యూజర్లు పండగ చేసుకుంటున్నారు.