ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 14 జూన్ 2018 (12:48 IST)

అడిగినా చెప్పొద్దు... అది లేకుండానే సిమ్ తీసుకోండి...

ఇకపై కొత్త సిమ్ కార్డు తీసుకోవాలంటే ఆధార్ నంబరు చెప్పాల్సిన పనిలేదు. ఒకవేళ టెలికాం ఆపరేటర్లు ఆధార్ నంబరు ఖచ్చితంగా కావాలని అడిగితే ఇచ్చేది లేదని తెగేసి చెప్పొచ్చు. ఈ మేరకు టెలికాం కంపెనీల జాబితా నుంచి

ఇకపై కొత్త సిమ్ కార్డు తీసుకోవాలంటే ఆధార్ నంబరు చెప్పాల్సిన పనిలేదు. ఒకవేళ టెలికాం ఆపరేటర్లు ఆధార్ నంబరు ఖచ్చితంగా కావాలని అడిగితే ఇచ్చేది లేదని తెగేసి చెప్పొచ్చు. ఈ మేరకు టెలికాం కంపెనీల జాబితా నుంచి ఆధార్ అనే కాలమ్‌ను తొలగించేశారు. ఈ విషయాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వెల్లడించింది.
 
నిజానికి గత కొన్ని రోజులుగా ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఆధార్ నంబరు కోసం వివిధ రకాలుగా పీడించాయి. కొత్త సిమ్ కావాలన్నా... సిమ్ కార్డు మార్చుకోవాలన్నా, చివరకు సిమ్ చిరునామా మార్చుకోవాలన్నా సరే ఆధార్ నంబరు తప్పకుండా సేకరించేవి. ఇలా చేయడం వల్ల వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుందని విషయం వెల్లడైంది. దీంతో టెలికాం సంస్థ చర్యలు చేపట్టింది. 
 
జూలై ఒకటో తేదీ నుంచి మొబైల్ కంపెనీలు విధిగా వర్చ్యువల్ ఐడీ తీసుకోవాల్సిందే. ఆధార్ నెంబర్ అడిగే హక్కు కూడా లేదని స్పష్టం చేసింది. ఇకపై ఆధార్‌ బదులు వీఐడీ తెలిపితే సరిపోతుంది. ఈ విధానం జూలై 1వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఆధార్ కార్డులకు సంబంధించిన ఎలాంటి ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయబోమంది.
 
అయితే, వీఐడీని httph://uidai.gov.in లో ఆధార్ ఆన్‌లైన్ సర్వీసెస్ విభాగంలో ఆధార్ సర్వీసెస్‌లో పొందవచ్చు. కొత్తగా ఓపెన్ అయ్యే పేజీలో ఆధార్ నెంబర్, సెక్యూరిటీ కోడ్‌లను పూరిస్తే… మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత అదే పేజీలో ఓటీపీని ఎంటర్ చేసి జనరేట్ వీఐడీ అనే బటన్‌ను క్లిక్ చేసి ఎంటర్ బటన్ నొక్కాలి. ఆ వెంటనే మొబైల్ నంబరుకు వర్చువల్ ఐడీ వస్తుంది. ఈ వీఐడీని మర్చిపోకుండా ఎక్కడైనా రాసి పెట్టుకోవడం మంచిది. ఒక వేళ మర్చి పోయినా వీఐడీని మళ్లీ పొందే అవకాశముంది.