శనివారం, 9 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 జనవరి 2023 (14:39 IST)

18వేల మంది ఉద్యోగులపై అమేజాన్ వేటు

Amazon
అమేజాన్ తన ఉద్యోగుల సంఖ్యను దాదాపు 18వేల మందికి తగ్గించే ప్రణాళికలో భాగంగా, తన కొత్త రౌండ్ తొలిగింపుల వల్ల ప్రభావితమైన తన ఉద్యోగులకు తెలియజేయడం ప్రారంభించింది. ఈ నిర్దిష్ట రౌండ్ లో ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమవుతున్నారనే దానిపై స్పష్టత లేదు.
 
అయితే కంపెనీ ఇప్పటికే 2,300 మంది ఉద్యోగులను వాషింగ్టన్‌లో తొలగించింది. వీరిలో ఎక్కువ మంది కంపెనీ ప్రధాన కార్యాలయం ఉన్న సీటెల్‌లో పనిచేశారని ది వెర్జ్ నివేదించింది.  
 
ఆ సమయంలో, దాని హార్డ్‌వేర్- సేవలు, మానవ వనరులు- రిటైల్ బృందాల సభ్యులతో సహా సుమారు 10,000 మంది ప్రజలు ప్రభావితమవుతారని నివేదికలు చెప్తున్నాయి. 
 
ఈ ఏడాది 2023లో మొత్తం 18,000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది. భారతదేశంలో దాదాపు 1,000 మందితో సహా ప్రపంచవ్యాప్తంగా 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అమేజాన్ ప్రకటించింది.