ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2022 (18:23 IST)

బీఎస్ఎన్ఎల్ గుడ్ న్యూస్: 100 అప్రంటీస్ పోస్టుల భర్తీ

bsnl logo
నిరుద్యోగులకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటీస్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తం 100 అప్రంటీస్ ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు mhrdnats.gov.in ని సందర్శించడం ద్వారా తమ దరఖాస్తును సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 29ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.