శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 జనవరి 2022 (08:56 IST)

switchtoBSNL క్యాంపెయిన్: 30 రోజుల పాటు హైస్పీడ్ 5జీబీతో ఇంటర్నెట్

భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన యూజర్లను పెంచుకునే పనిలో పడింది. బీఎస్ఎన్ఎల్ డేటాకు మారే యూజర్లకు నెల రోజుల పాటు 5జీబీ హైస్పీడ్ డేటా ఉచితంగా అందిస్తుంది. 
 
ఈ డేటా ప్రస్తుత నెట్‌వర్క్ నుంచి బీఎస్ఎన్ఎల్‌కు పోర్టయిన వారికే ఈ ఆఫర్ వర్తిస్తున్నది. దేశంలోని అన్ని సర్కిళ్లలో ఈ నెల 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇంకా వినియోగదారుల కోసం వినూత్నంగా #switchtoBSNL అనే క్యాంపెయిన్ చేపట్టింది.
 
ఇతర నెట్‌వర్క్‌ల నుంచి తమ నెట్‌వర్క్‌లోకి వచ్చే యూజర్లకు బీఎస్ఎన్ఎల్ షరతులు పెట్టింది. పోర్టబుల్ కానున్న నంబర్ నుంచి 9457086024 అనే ఫోన్ నంబర్‌కు స్క్రీన్‌షాట్లు పంపాలి. వీటిని పరిశీలించాకే ఆ ఖాతాదారులకు 30 రోజుల పాటు హైస్పీడ్ 5జీబీతో ఇంటర్నెట్ డేటా అందిస్తుంది.