గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2023 (19:34 IST)

జనవరి 2024తో జీ-మెయిల్ HTML version వుండదు..

Gmail
గూగుల్ సెర్చింజన్ జీ-మెయిల్ సేవకు సంబంధించిన ప్రాథమిక HTML వెర్షన్‌ను జనవరి 2024లో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. బ్రౌజర్లో జీమెయిల్ తాజా వెర్షన్‌ను ఉపయోగించండే శీర్షికతో గూగుల్ ఈ వివరాలను ఇచ్చింది. దీంతో Google ప్రాథమిక HTMLకు బైబై చెప్పాలని గూగుల్ నిర్ణయించుకుంది. జనవరి 2024 వరకు ప్రాథమిక HTMLను బ్రౌజర్‌లో కనిపిస్తుందని సంస్థ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.  
 
ఇంతలో, Google Androidలోని Gmailకి ఉపయోగకరమైన "అన్నీ ఎంచుకోండి" బటన్‌ను జోడిస్తోంది. వినియోగదారులు తమ ఇన్‌బాక్స్‌ను మరింత సులభంగా, క్లియర్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.
 
వినియోగదారులు ఒకేసారి బహుళ ఇమెయిల్‌లను ఎంచుకోవడం ప్రారంభించినప్పుడు Android కోసం Gmail "ఆల్ సెలెక్ట్" బటన్‌ను చూపడం ప్రారంభిస్తుంది. ఈ ఫీచర్ కొంతకాలంగా Gmail వెబ్ యాప్‌లో అందుబాటులో ఉంది. కానీ మొబైల్ పరికరాల్లో ఎప్పుడూ అందుబాటులో లేదు.