శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Modified: సోమవారం, 3 డిశెంబరు 2018 (17:32 IST)

అంగారకుడిపై అదంతా బంగారమేనా? మెరిసిపోతోంది...

బంగారం అంటే బాగా పిచ్చి. ఖరీదైన లోహాలు ఎన్ని వున్నా బంగారానికి వున్న డిమాండే వేరు. ఇప్పుడిదంతా ఎందుకయా అంటే... నాసా అంగారకుడి పైకి పంపిన క్యూరియోసిటీ రోవర్ పంపిన ఫోటోలే కారణం. అది పంపిన తాజా ఫోటోలను చూసిన సైంటిస్టులు నొసలు ఎగరేస్తున్నారు. మార్స్ పైన ఈమధ్యే చక్కగా దిగిన రోవర్ గ్రహం పైన వున్న పరిస్థితులను తెలియజేస్తూ ఫోటోలను పంపుతోంది. 
 
ఆ క్రమంలో పంపిన కొన్ని ఫోటోలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం రోవర్ తిరుగుతున్న ఏరియాలో పెద్దపెద్ద నల్లటి బండరాళ్లున్నాయట. ఐతే వాటి తాలూకు ఫోటోలను పంపగా అందులో కొన్ని ఫోటోలు బంగారంలా ధగధగ మెరిపోతున్నాయట. వ్యవహారం చూస్తుంటే అక్కడంతా బంగారు కొండలున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా అంగారకుడిపై బంగారు కొండలున్నాయో లేదో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.