1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 మే 2025 (17:14 IST)

iPhone 17: సెప్టెంబరులో ఐఫోన్ 17 ఎయిర్.. ఫీచర్స్ ఇవే

iPhone 17
iPhone 17
ఐఫోన్ 17 సిరీస్ నుంచి లాంఛ్ కానున్న మొబైల్ ఫీచర్స్ లీక్ అయ్యాయి. ఐఫోన్ 17 ఎయిర్ పేరుతో సెప్టెంబరులో లాంచ్ అయ్యే అవకాశం ఉన్న ఈ ఫోన్లకి ఫీచర్స్ లీకవ్వడంతో ఇప్పటి నుంచే భారీ డిమాండ్ ఏర్పడింది. ఐఫోన్ 17 ఎయిర్ బరువు సుమారు 145 గ్రాములు, మందం కేవలం 5.5 మిల్లీమీటర్లు మాత్రమేనని అంటున్నారు. ఇది గనుక నిజమైతే, ఇప్పటి వరకూ విడుదలైన ఐఫోన్‌ల్లో ఇది అత్యంత సన్నగా ఉండే ఫోన్ ఇదే అవుతుంది. 
 
గతంలో వచ్చిన ఐఫోన్ SE 2 లేదా 13 మినీ మోడళ్లను బీట్ చేస్తుందని భావిస్తున్నారు. గతంలో లాగే ఈ ఏడాది కూడా సెప్టెంబర్‌లో తన ఐఫోన్ 17 సిరీస్‌ను విడుదల చేయనుంది. ప్లస్ మోడల్ స్థానంలో ఈసారి ఐఫోన్ 17 ఎయిర్ రావొచ్చు. తాజా లీక్‌ల ప్రకారం సెప్టెంబర్ 18 లేదా 19 తేదీల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ధర విషయానికి వస్తే ఇది సుమారు రూ. 90,000 ప్రారంభ ధర వద్ద ఉండవచ్చని ఊహిస్తున్నారు.