శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2017 (09:37 IST)

ఒప్పో ఫోన్లకు అదనంగా జియో 100 జీబీ డేటా

రిలయన్స్ జియో - ఒప్పో మొబైల్స్ సంస్థ మధ్య ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా, తమ జియో యూజర్లకు అదనపు డేటాను ఆఫర్‌ చేస్తున్నాయి. రూ.309, ఆపై మొత్తాల జియో రీఛార్జ్‌లకు 100 జీబీ వరకు అదనపు

రిలయన్స్ జియో - ఒప్పో మొబైల్స్ సంస్థ మధ్య ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా, తమ జియో యూజర్లకు అదనపు డేటాను ఆఫర్‌ చేస్తున్నాయి. రూ.309, ఆపై మొత్తాల జియో రీఛార్జ్‌లకు 100 జీబీ వరకు అదనపు డేటాను జియో 4జీ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులు పొందనున్నారు. ఈ ఆఫర్‌ 2017 అక్టోబరు 27 నుంచి 2018 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది.
 
ఒప్పో ఎఫ్5, ఎఫ్3, ఎఫ్3 ప్లస్, ఎఫ్1 ప్లస్ యూజర్లు జియోలో రూ.309 ఆపైన విలువ గల ప్లాన్లతో రీచార్జి చేసుకుంటే రీచార్జికి 10జీబీ 4జీ డేటా చొప్పున మొత్తం 10 సార్లు చేసే రీచార్జిలకుగాను 100జీబీ డేటాను పొందవచ్చు. 
 
అలాగే ఒప్పో ఎఫ్1ఎస్, ఎ33ఎఫ్, ఎ37ఎఫ్, ఎ37ఎఫ్‌డబ్ల్యూ, ఎ57, ఎ71 ఫోన్లను వాడుతున్న యూజర్లు కూడా రూ.309 ఆపైన విలువ గల ప్లాన్లతో రీచార్జి చేసుకుంటే రీచార్జికి 10జీబీ డేటా చొప్పున మొత్తం 6 సార్లు చేసే రీచార్జిలకుగాను 60జీబీ డేటాను పొందవచ్చు.