బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 అక్టోబరు 2023 (21:57 IST)

రెండు రోజుల్లోనే నాలుగు లక్షల ఐఫోన్లు కొన్నారట!

iPhone 15 Pro Max
ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ప్రస్తుతం స్పెషల్ సేల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఐఫోన్స్ కూడా భారీ డిస్కౌంట్స్‌తో అందుబాటులోకి వచ్చాయి. దీంతో యాపిల్ ఫ్యాన్స్ ఈ ఫోన్ల కోసం ఎగబడ్డారు. 
 
దేశవ్యాప్తంగా రెండు రోజుల్లోనే నాలుగు లక్షలకుపైగా ఐఫోన్లు కొనుగోలు చేశారట. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో ఐఫోన్లపై కనీసం రూ.10 వేలకుపైగా డిస్కౌంట్ లభించింది. 
 
అలా ఫ్యాన్స్ నాలుగు లక్షలకు పైగా ఐఫోన్లను కొనుగోలు చేశారు. అది కూడా రెండు రోజుల్లోనే కొనుగోలు చేయడం విశేషం. ఐఫోన్ సిరీస్‌ ఫోన్ల అమ్మకం ఆఫ్‌లైన్ సేల్స్ కన్నా.. ఆన్‌లైన్ సేల్స్ ఎక్కువగా ఉన్నాయి.