జియో సంచలనం.. సరికొత్త రికార్డు.. టెలికాం సంస్థలు బెంబేలు

reliance jio
సెల్వి| Last Updated: గురువారం, 21 నవంబరు 2019 (13:23 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత జియోతో సంచలనం సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఇంధన దిగ్గజంగా అవతరించింది. దాంతో ఎలైట్ క్లబ్‌లో చేరినట్లైంది. అటు ఆ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ.. ఇటు రిలయన్స్ సంస్థలు నంబర్ వన్ దిశగా ముందడుగు వేస్తోంది. ప్రపంచంలోనే మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో బ్రిటీష్ మల్టీ నేషనల్ ఆయిల్ కంపెనీ బీపీని వెనక్కి నెట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆరవ స్థానంలో నిలిచింది.

గత రెండు రోజుల్లోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్స్ 6 శాతం పెరిగాయి. షేర్ విలువ తొలి సారి రూ.1500 మార్కు దాటింది. ప్రస్తుతం రూ.1534 వద్ద కొనసాగుతోంది. ఇక.. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9.5 లక్షల కోట్లకు చేరింది. తర్వలోనే రూ.10 లక్షల కోట్ల మార్కెట్ విలువ దాటిన తొలి భారతీయ కంపెనీగా రికార్డు నెలకొల్పనుంది.

వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్‌టెల్ డిసెంబరు 1 నుంచి టారిఫ్ ఛార్జీలు పెంచుతామని ప్రకటించిన తర్వాత రిలయన్స్ మార్కెట్ విలువ మరింత పెరగడం గమనార్హం. దానివల్ల జియో మరింత మంది యూజర్లను ఆకర్షించే అవకాశం ఉందని టాక్ వస్తోంది.దీనిపై మరింత చదవండి :