వాట్సాప్‌కు గండికొట్టారు.. న్యూ ప్రైవసీ పాలసీతో టెలిగ్రామ్‌కు క్రేజ్
సోషల్ మీడియా జెయింట్ ఫేస్‌బుక్ అనుబంధ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రమాదంలో వున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. తన పేరెంట్ సంస్థ ఫేస్‌బుక్‌తో ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం షేర్ చేసుకుంటామని పేర్కొంటూ వాట్సాప్ న్యూ ప్రైవసీ పాలసీని ప్రకటించడంతోనే యూజర్లలో ఆందోళన మొదలైంది. ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్ మస్క్ వంటి వారు సిగ్నల్‌కు మారండంటూ ట్వీట్లు చేయడంతో యూజర్లు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపారు.
ఫలితంగా వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా సిగ్నల్, టెలిగ్రామ్ యాప్‌లపై దృష్టి సారించారు. గత నెలలో స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌ల్లో టెలిగ్రామ్ నిలిచింది. అంటే, వాట్సాప్ న్యూ ప్రైవసీ పాలసీపై విముఖతతో యూజర్లు ప్రత్యామ్నాయం వైపు మళ్లడంతో టెలిగ్రామ్ అత్యధికంగా లబ్ధి పొందింది.
మరింత వ్యక్తిగత గోప్యత, స్వేచ్ఛ కోరుకుంటున్న యూజర్లు 10 కోట్ల మందికి పైగా గత నెలలో తమ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారని టెలిగ్రామ్ తెలిపింది. వాట్సాప్, లైన్, కకావో టాక్ వంటి యాప్‌ల మాదిరిగానే తమ యాప్‌లోనూ మార్పులు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ యాప్ వ్యక్తులు, గ్రూప్‌ల మధ్య చాటింగ్‌కు అనువుగా ఉంటుంది.
ఫలితంగా 2021 జనవరిలో గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ ప్లే స్టోర్ నుంచి అత్యధికంగా యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌ల్లో టెలిగ్రామ్ నిలిచిందని తాజా సెన్సర్ టవర్ నివేదిక పేర్కొంది. 2020 జనవరితో పోలిస్తే గత నెలలో టెలిగ్రామ్ యాప్ డౌన్‌లోడ్లు 3.8 రెట్లు పెరిగాయి.
భారత్‌లో 24 శాతం, ఇండోనేషియాలో 10 శాతం మంది యూజర్లు టెలిగ్రామ్ యాప్ డౌన్‌లోడ్.. అటుపై ఇన్‌స్టాల్ చేసుకున్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌ల్లో టెలిగ్రామ్ తొమ్మిదో స్థానంలో, ఆపిల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ అయిన యాప్స్‌లో నాలుగో స్థానాన్ని సంపాదించుకుంది. ఇక భారత్‌లో నిషేధం విధించినా అత్యధికంగా యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌ల్లో చైనాకు చెందిన టిక్‌టాక్ ఉండటం గమనార్హం.