బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 25 అక్టోబరు 2022 (23:32 IST)

ఎల్లకాలం నిలవడానికి తయారుచేయబడిన ఫోన్: మన్నికకు ఒప్పో రెనో8 సిరీస్

oppo
2015లో, ప్రతి ఆరు నెలలకు పెద్ద సంఖ్యలో భారతీయ వినియోగదారులు తమ హ్యాండ్సెట్లను అప్గ్రేడ్ చేసుకున్నారు. 2016-17లో, ఇది 9-12 నెలలకు పెరిగింది. 2020 నాటికి ఇది రెండు సంవత్సరాలకు చేరుకుంది. నేడు, పరిశ్రమ నిపుణులు దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు వినియోగదారులు తమ పరికరాలను ఉపయోగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వినియోగదారుల ప్రవర్తనలో ఈ మార్పుకు అనుగుణంగా, ఎక్కువ కాలం పాటు మన్నికనిచ్చే పరికరాన్ని రూపొందించడానికి ఒప్పో తన ఆర్&డి ప్రయత్నాలను మమ్మురం చేసింది.
 
మన్నికకు ఒప్పో వాగ్దానం
రెనో8 సిరీస్లో 1600 బ్యాటర్ ఛార్జ్ సైకిల్స్ సాధారణ పరిశ్రమ స్థాయి 800 చార్జ్డ్ సైకిల్స్తో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ.
 
ప్రొప్రయిటరీ బ్యాటరీ హెల్త్ ఇంజిన్, బ్యాటరీ జీవితకాలాన్ని పొడిగిస్తుంది మరియు, బ్యాటరీ దీర్ఘకాలాన్ని ప్రభావితం చేయకుండానే గరిష్ట ఛార్జింగ్ వేగాన్ని నిర్ధారిస్తుంది.
 
రెనో 8 సిరీస్ 3 సంవత్సరాల తర్వాత కూడా సాఫీగా నడుస్తుంది; దీనిని TUV SUD యొక్క 36-నెలల ఫ్లూయెన్సీ రేటింగ్ A ధృవీకరిస్తుంది
 
రెనో8 సిరీస్‌కి రెండు పూర్తిస్థాయి OS అప్డేట్లు ఉండటం వల్ల, వినియోగదారులు కనీసం 2024 రెండవ త్రైమాసికం వరకు అత్యంత నూతన ఆండ్రాయిడ్ OSని కలిగి ఉంటారు.
 
ఆందోళన లేని వాడకం కోసం, నాలుగు సంవత్సరాల సెక్యూరిటి అప్డేట్లు వినియోగదారుల డేటాను మాల్వేర్ మరియు వైరస్‌ల నుండి రక్షిస్తాయి.
 
రెనో8 సిరీస్ మన్నికను నిర్ధారించడానికి, ఒప్పో టెస్ట్ ల్యాబ్లో 300 కంటే ఎక్కువ కఠినమైన పరీక్షలకు గురి చేయబడుతుంది.
 
రెనో8 సిరీస్ వినియోగదారులు ప్లాటినం ఆఫ్టర్ సేల్స్ సర్వీస్కి యాక్సెస్ కలిగి ఉంటారు, ఇందులో రిపేర్ల కోసం హోమ్ పికప్ మరియు డ్రాప్, అలాగే 24/7 ఇన్స్టంట్ హెల్ప్లైన్ అందుబాటులో ఉంటాయి.
 
ఎక్కువ కాలం మన్నికనిచ్చే, సురక్షితమైన మరియు వేగవంతమైన బ్యాటరీ ఛార్జింగ్
స్మార్ట్ఫోన్ ఎక్కువ కాలం నిలవడానికి బ్యాటరీ హెల్త్ పెద్ద పాత్ర పోషిస్తుంది. ఒప్పో తన సూపర్వూక్ ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీలో ఎల్లప్పుడూ తన విలువను నిరూపించుకుంది మరియు ఇప్పుడు తన ప్రొప్రయిటరీ బ్యాటరీ హెల్త్ ఇంజిన్ (BHE)తో మరింత ముందుకు దూసుకుపోతోంది. మెరుగైన భద్రత మరియు పనితీరు కోసం, BHE చిప్,  స్మార్ట్ బ్యాటరీ హెల్త్ అల్గారిథమ్ మరియు బ్యాటరీ హీలింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ఆల్గారిథమ్ బ్యాటరీ జీవితకాలాన్ని పొడిగించడానికి మరియు వేగవంతమైన ఛార్జింగ్ వేగాన్ని అనుమతించడానికి గరిష్ట ఛార్జింగ్ కరెంట్ను డైనమిక్గా సర్దుబాటు చేస్తుంది.
 
మరోవైపు, ఒప్పో యొక్క బ్యాటరీ హీలింగ్ టెక్నాలజీ బ్యాటరీ, తన సాధారణ ఛార్జ్ మరియు డిస్ఛార్జ్ల సమయంలో ఎలక్ట్రోడ్లను నిరంతరం రిపేర్ చేయడం ద్వారా బ్యాటరీ జీవితాన్ని పొడిగిస్తుంది. రెనో8 సిరీస్లోని ఈ సాంకేతికతలతో, బ్యాటరీ ఛార్జ్ సైకిళ్లను ఒప్పో 1,600కి పెంచింది, ఇది పరిశ్రమ సగటు 800 ఛార్జ్ సైకిళ్ల కంటే రెండింతలు ఎక్కువ. ఒప్పో బ్యాటరీలు ఇప్పుడు వాటి అసలు కెపాసిటీలో 80%ని నాలుగు సంవత్సరాల వరకు-అదే అధిక స్థాయి భద్రతతో-మార్కెట్లో అత్యధికంగా కొనసాగిన స్మార్ట్ఫోన్ బ్యాటరీ జీవితకాలంగా నిలబెట్టాయి.