ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2022 (11:03 IST)

తొలి దశలో 13 నగరాల్లో 5జీ సేవలు... తెలుగు రాష్ట్రాల్లో ఆ ఒక్క నగరంలో...

5gspectrum service
దేశంలో మొబైల్ ఫోన్ రంగంలో మరో విప్లవాత్మకమైన మార్పు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే దేశంలో 5జీ సేవలు అందుబాటులో రానున్నారు. అయితే, తొలి దశలో 13 నగరాల్లో ఈ 5జీ సలేవలు అందించనున్నారు. అనంతరం దశలవారీగా దేశ వ్యాప్తంగా విస్తరించనున్నారు. 
 
కాగా, తొలి దశలో 5జీ సేవలు అందుబాటులో వచ్చే నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క హైదరాబాద్ నగరంలో మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే, ఢిల్లీ, బెంగుళూరు, ముంబై, చెన్నై, కో‌ల్‌కతా, పూణె, అహ్మదాబాద్, లక్నో, చండీగఢ్, జామ్ నగర్, గురుగ్రామ్, గాంధీగ్రామ్ ఉన్నారు. 
 
5జీ సేవలు సెప్టెంబరు 29 నుంచి అందుబాటులో వస్తాయని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే దేశంలో 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కోసం భారీ ఎత్తున వేలం జరగడం తెల్సిందే. స్పెక్ట్రమ్‌ను చేజిక్కించుకున్న టెలికాం సంసథ 5జీ వ్యవస్థల ఏర్పాటులో తలమునకలుగా ఉన్నాయి.