మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 డిశెంబరు 2021 (15:56 IST)

పేటీఎంకు మరోసారి ఎదురుదెబ్బ: ముగ్గురూ ఒకేసారి రాజీనామా?

ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎంకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా సంస్థకు చెందిన ముగ్గురు సీనియర్ ఉద్యోగులు బయటకు వెళ్ళిపోయారు. రాజీనామాలు చేసిన వారిలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిషేక్ అరుణ్, ఆఫ్ లైన్ పేమెంట్స్ సీవోవో రేణు సాతి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ గుప్తా ఉన్నారు.
 
వీరు ముగ్గురూ ఒకరివెంట మరొకరు రాజీనామా చేసినట్టు సమాచారం. అభిషేక్ అరుణ్ ఐదేళ్లకు పైగా పేటీఎంలో ఉన్నారు. అభిషేక్ గుప్తా, రేణు సాతి గత ఏడాదే పేటీఎంలో చేరారు. 
 
అయితే వీరు రాజీనామాలు చేసినట్టు పేటీఎం అధికారికంగా ప్రకటించలేదు. ఈ ఏడాది ఆరంభంలో ఐదుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు సంస్థ నుంచి బయటకు వెళ్లారు. ఇటీవలే పేటీఎం ఐపీఓకు వెళ్లింది.
 
అయితే ఈ ఐపీఓ ఆదిలోనే నిరాశపరిచింది. ఈ తరుణంలో ముగ్గురు టాప్ లెవెల్ అధికారులు బయటకు వెళ్లడం కంపెనీకి పెద్ద దెబ్బగానే భావించవచ్చు.