బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జులై 2023 (16:51 IST)

వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. షార్ట్ వీడియో మెసేజెస్‌తో..?

whatsapp
వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ వచ్చేసింది. తాజాగా షార్ట్ వీడియో మెసేజెస్ స్పెసిఫికేషన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్‌తో చాట్ విండోలో నేరుగా 60 సెకన్ల పాటు రియల్ టైమ్ వీడియో రికార్డ్ చేసి సెండ్ చేసుకోవచ్చు. తాజా వీడియో మెసేజ్ ఫీచర్‌తో, వాట్సాప్ చాట్‌లోనే ఒక రౌండ్ షేప్‌లో కెమెరా బటన్ ఉంటుంది.
 
దానిపై క్లిక్ చేసి.. సింపుల్‌గా వీడియో రికార్డ్ చేసి ఫాస్ట్‌గా సెండ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఈ ఫెసిలిటీ కారణంగా వాట్సాప్‌లో పంపించే వీడియోలు నార్మల్ వీడియోలాగా ఫుల్ స్క్రీన్‌తో సెండ్ అయ్యేవి. కానీ కొత్త ఫీచర్‌తో వీడియో మెసేజ్‌లు సర్కులర్ షేప్‌లో ఉండి షార్ట్ సైజులో సెండ్ అవుతాయి. 
 
ఐఫోన్ , ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లందరికీ వీడియో మెసేజెస్ లాంచ్ చేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. అందరికీ ఇప్పటికిప్పుడే ఈ ఫీచర్ రిలీజ్ కాకపోవచ్చు. ఈ అప్‌డేట్ విడుదల క్రమంగా జరుగుతోంది. సో ఈ ఫీచర్ కోసం వేచి వుండకతప్పదు.