శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 డిశెంబరు 2021 (17:48 IST)

వాట్సాప్ చాటింగ్ : అందుబాటులోకి కొత్త ఫీచర్‌

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ చాటింగ్ విషయంలో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. డిస్ అప్పియరింగ్ మెస్సేజెస్ ఫీచర్‌ను మరో రెండు మోడ్‌లలో అందుబాటులోకి తెచ్చినట్లు వాట్సాప్ సంస్థ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. మెటా సంస్థకు చెందిన వాట్సాప్ డిస్ అప్పియరింగ్ మెస్సేజెస్ (ఆటో డిలీట్) ఫీచర్‌ రెండు మోడ్‌లలో తీసుకొచ్చింది.
 
ఈ ఫీచర్‌ను మీరు ఓకే చేసుకుంటే వాట్సాప్ చాటింగ్, మెస్సేజ్‌లు 24 గంటల తరువాత ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి. రెండో ఆప్షన్ తీసుకుంటే 90 రోజుల తరువాత మీ వాట్సాప్ మెస్సేజ్‌లు డిస్ అప్పియర్ అవుతాయని మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. 
 
ఇప్పటివరకూ వాట్సాప్ చాటింగ్ 7 రోజుల తరువాత ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి. వీటికి అదనంగా మరో రెండు టైమ్ పీరియడ్స్‌లో మెస్సేజ్‌లు వాటంతట అవే డిలీట్ అయ్యే ఫీచర్‌ను తీసుకొచ్చింది.