సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 డిశెంబరు 2021 (11:29 IST)

ఊబెర్ నుంచి అదిరిపోయే ఫీచర్.. క్యాబ్ బుక్ చేసుకోవాలంటే..?

ఊబెర్ నుంచి అదిరిపోయే ఫీచర్ వచ్చింది. అదేంటో తెలుసుకుంటే మీరు కచ్చితంగా షాకవుతారు. సాధారణంగా క్యాబ్ బుక్ చేసుకోవాలంటే.. కచ్చితంగా స్మార్ట్ ఫోనులో యాప్ వుండి తీరాల్సిందే.
 
కానీ ఇకపై ఎలాంటి యాప్ లేకుండా ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. ఎలాగంటే.. యాప్ అవసరం లేకుండానే వాట్సాప్‌లో క్యాబ్‌ను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది ఊబెర్. అఫీషియల్ చాట్ బోట్‌తో కనెక్ట్ అయి క్యాబ్‌ను బుక్ చేసుకునే వీలు కల్పించింది.
 
ఈ ఫీచర్‌ను ప్రపంచంలోనే భారత్‌లో తొలిసారి తీసుకొస్తున్నట్టు ఊబెర్ ప్రకటించింది. రిజిస్ట్రేషన్ దగ్గర్నుంచి బుకింగ్ దాకా అన్ని వాట్సాప్‌తోనే జరిగిపోతాయని తెలిపింది. ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా కేవలం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోనే దీనిని అమలు చేయనున్నారు. 
 
అతి త్వరలోనే మిగతా నగరాలకూ దానిని విస్తరించనున్నారు. ప్రస్తుతం ఇంగ్లిష్‌లోనే అందుబాటులో ఉన్నా.. త్వరలో మిగతా భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. వాట్సాప్ ద్వారా మూడు రకాలుగా క్యాబ్ ను బుక్ చేసుకునే అవకాశాన్ని ఊబెర్ కల్పించింది.