ఫ్రెషర్స్‌కు విప్రో బంపర్ ఆఫర్.. ఏంటది?
ఫ్రెషర్స్‌కు ఐటీ దిగ్గజం విప్రో బంపర్ ఆఫర్ ప్రకటించింది. క్యాంపస్ నియామకాల్లో నియమితులైన నిపుణులకు ఐదేళ్ల వేతన ప్రణాళిక అమలు చేస్తున్నట్లు విప్రో తెలిపింది. వార్షిక ఇంక్రిమెంట్లు, బోనస్‌లతోపాటు పలు బెనిఫిట్లు కల్పిస్తామని తెలిపింది.
మూన్ లైటింగ్‌కు పాల్పడిన ఉద్యోగులను కనిపెట్టేందుకు పలు రకాల పద్దతులు అవలంభిస్తున్నామని విప్రో వెల్లడించింది. పరిహార కోణాన్ని, కెరీర్‌ను పరిగణనలోకి తీసుకుని చాలా స్పష్టంగా ఐదేళ్ల వేతన ప్యాకేజీ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు సంబంధిత క్యాంపస్ రిక్రూటీలకు సమాచారం ఇచ్చామని తెలిపింది.
క్యాంపస్ రిక్రూట్‌మెంట్లలో నియమితులైన వారి వేతనం వచ్చే ఐదేండ్లలో ఎలా పెరుగుతుందో వివరిస్తూ ఆఫర్ లెటర్లలో పేర్కొంటున్నట్లు విప్రో పేర్కొంది. విభిన్న బోనస్‌లతోపాటు వేతనాల పెంపు తదితర వివరాలు ఆ ఆఫర్ లెటర్లలో ఉంటాయని విప్రో చీఫ్ రీసోర్సెస్ ఆఫీసర్ సౌరవ్ గోవిల్ తెలిపారు.