శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు
Written By
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (12:52 IST)

అసలు ఎందుకు ప్రేమిస్తున్నారు..?

ప్రేమ అంటే ఏంటి.. అసలు ఎందుకు ప్రేమిస్తున్నారు..? అనే ప్రశ్నకు సమాధానాలు భిన్నంగా ఉంటాయి. పూర్తికా వ్యక్తిగతమైనవి. అయితే.. కచ్చితంగా ప్రేమని వ్యక్తం చేయడానికి ముందే అవగాహనకి రావాలి. అప్పుడే ప్రేమించేవారిని భిన్న కోణాల్లో నుండి చూడడానికి వీలుపడుతుంది. అప్పుడే ఎలాంటి స్పందనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారు.
 
ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు ఇరువురి చుట్టూ ఉన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఓ అంచనాకి వస్తుండాలి. ఇద్దరు సంవత్సరం నుండి ప్రేమలో ఉన్నారు. అనుకోకుండా వారి మధ్య భేదాభిప్రాయం వచ్చాయంటే.. వారు మారిపోయారు అనుకోవడం కరెక్టు కాదు. వారి చుట్టూ ఉన్న పరిస్థితులు మారాయ్ అనుకోవాలి. అప్పుడే ఒకరిపై ఒకరికి ద్వేషం పుట్టకుండా వారి చుట్టూ పరిస్థితులపై విశ్లేషణ మొదలవుతుంది.
 
దీంతో వారికున్న పరిస్థితులపై స్పష్టత వస్తుంది. అప్పుడు ఇద్దరూ నిందించుకోవడం మానేసి.. వారి చుట్టూ ఉన్న పరిస్థితులపై పోరాటం మొదలుపెడుతారు. ఓ అవగాహనకు వస్తారు. ముఖ్యంగా ఒకరి నిర్ణయం పట్ల మరొకరికి గౌరవం పుడుతుంది. దేన్నయినా స్వీకరించడానికి సిద్ధపడుతారు.