శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు
Written By
Last Modified: బుధవారం, 17 ఏప్రియల్ 2019 (21:31 IST)

ప్రేయసి దృష్టిలో సూపర్ మాన్‌గా ఉండిపోవాలంటే?

ప్రేయసి దృష్టిలో సూపర్ మాన్‌గా ఉండిపోవాలంటే? ఏం చేయాలో తెలుసా? లవర్‌కి రక్షణ కల్పించేలా ఉండాలి. స్త్రీలు రక్షణ కల్పించేవాళ్ళను ఇష్టపడతారు. కాబట్టి ప్రియురాలు బాధలో ఉన్నపుడు ఆమె సంరక్షకుడిగా నిరూపించుకోవడానికి ఒకటికంటే ఎక్కువ మార్గాలను ప్రదర్శించాలి. స్త్రీలు వివాదాల సమయంలో ఎవరు అండగా నిలబడతారో వారిని ఎప్పుడూ అభిమానిస్తారు. అటువంటి పరిస్థితులు వచ్చినపుడు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. 
 
అప్పడప్పుడు సర్‌ప్రైజ్ ఇవ్వాలి. చాక్‌లేట్లు, లవ్ నోట్స్, బహుమతులు లేదా అనేక ఫ్లవర్స్ వంటి సర్‌ప్రైజ్‌లను స్త్రీలు ఇష్టపడతారు. స్త్రీలకూ ఎన్ని ఇచ్చినా వారికి అభ్యంతరం ఏమీలేదు. ఈ ఒక్క విషయంపై అనేక మార్కులను పొందవచ్చు.
 
ఇకపోతే పారదర్శకంగా ఉండాలి. నిజాయితీగా ఉండడం ఎప్పటికీ మంచి పద్ధతి. అనుబంధాన్ని ఎక్కువకాలం నిలబెట్టుకోవాలి అంటే ఆమెకు అబద్ధాలు చెప్పకూడదు. ప్రారంభంలో ఎన్ని విమర్శలను ఎదుర్కున్నా ఫరవాలేదు, కానీ చివరకు ఆమె మనసును గెలుచుకుంటారు.