బీహార్‌లో దారుణం .. జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు...
బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయాలపాలయ్యారు. ఈ ఘటన వైశాలి జిల్లాలోని మన్హార్‌లో ఆదివారం రాత్రి జరిగింది.
ఓ పూజా కార్యక్రమాన్ని తిలకించేందుకు స్థానికులు భారీ సంఖ్యలో నిలబడివున్నారు. వారిపైకి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు నియంత్రణ కోల్పోయి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వెల్లడించారు.