శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 9 జనవరి 2023 (13:25 IST)

బెంగుళూరులో 12 యేళ్ల బాలుడికు గుండెపోటు!!

deadbody
ప్రస్తుతం గుండెపోటులు సర్వసాధారణమై పోయాయి. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ గుండెపోటుబారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా 12 యేళ్ళ బాలుడు సైతం గుండెపోటుతో చనిపోయాడు. ఈ విషాదకర ఘటన కర్నాటక రాష్ట్రంలోని మడికేరి జిల్లాలో వెలుగు చూసింది. 
 
జిల్లాలోని కూడమంగళూరు అనే ప్రాంతానికి చెందిన మంజాచారి పాఠశాల బస్సు డ్రైవరుగా అనే వ్యక్తి కుమారుడు కీర్తన్‌కు 12 యేళ్ళ వయసు. ఆరో తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం తన స్నేహితులతో ఆడుకుని రాత్రి ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత స్నానం చేసి సేదతీరుతున్న గుండె నొప్పిగా ఉందని చెప్పాడు. 
 
ఆ తర్వాత నొప్పితో విలవిల్లాడిపోయాడు. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆ బాలుడు చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. గుండెపోటు రావడం వల్లే కీర్తన్ చనిపోయినట్టు తెలిపారు. దీంతో కీర్తన్ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.