శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 3 జనవరి 2023 (14:04 IST)

జ్ఞానయోగాశ్రమ పీఠాధిపతి సిద్ధేశ్వర స్వామి ఇకలేరు...

Siddeshwara Swami
కర్నాటక రాష్ట్రంలోని జ్ఞానయోగాశ్రమ పీఠాధిపతి సిద్ధేశ్వర స్వామి ఇకలేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఈయన సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 81 యేళ్లు. వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన సోమవారం సాయంత్రం ఆశ్రమంలోనే తుదిశ్వాస విడిచినట్టు విజయపురి డిప్యూటీ కమిషనర్ విజయ్ మహంతేష్ వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు, అనుచరులు భారీ సంఖ్యలో తరలివచ్చి నివాళులు అర్పిస్తున్నారు. 
 
ఈయనకు కర్నాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో కూడా భక్తులు ఉన్నారు. పాండిత్య ప్రసంగాలు, శక్తివంతమైన వక్తృత్వానికి ఈయనకు మంచి పేరుగడించారు. ఇదిలావుంటే, సిద్ధేశ్వర స్వామి అంత్యక్రియలను కర్నాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. స్వామికి నివాళులు అర్పించేందుకు వీలుగా విజయపుర జిల్లా యంత్రాంగం మంగళవారం పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ముఖ్యనేతలు సిద్ధేశ్వర స్వామి మృతిపట్ల తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.