బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 31 జులై 2021 (11:01 IST)

పుల్వామాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఎన్‌కౌంటర్‌లో హతం

జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రంలోని పుల్వామాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలపై ముష్కర మూకలు కాల్పులకు తెగబడ్డాయి. దీంతో ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిగాయి. నాగ్‌బెరన్‌ - తార్సర్‌ అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హత్యమయ్యారు. 
 
అయితే, మృతులు ఏ సంస్థకు చెందిన గుర్తించలేదని కాశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.