సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 నవంబరు 2022 (13:28 IST)

పట్టాలపై కూర్చుని పండ్లు తింటున్న చిన్నారుల ప్రాణాలు తీసిన ట్రైన్

train accident
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పట్టాలపై కూర్చొని పండ్లు ఆరగిస్తున్న నలుగురు చిన్నారులను ఓ రైలు ఢీకొట్టింది. దీంతో ఆ నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోరం పంజాబ్ రాష్ట్రంలోని కిరత్‌పూర్ సాహిబ్‌‌లో జరిగింది. 
 
సట్లేజ్ నదిపై ఉన్న లొహంద్ రైల్వే బ్రిడ్జి సమీపంలో నలుగురు చిన్నారులు చెట్లకు ఉన్న పండ్లను తెంపుకుని ఆ పక్కనే ఉన్న పట్టాలపై కూర్చొని ఆరగిస్తున్నారు. ఆ సమయంలో  సహరాన్ పూర్ నుంచి హిమాచల్ ప్రదేశ్ ఓ ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వెళుతున్నది. 
 
అయితే, ఈ రైలును ఆ చిన్నారులు గమనించలేదు. వారు పట్టాలపైనే కూర్చొని పండ్లు తింటూ కూర్చొన్నారు. దీంతో వారిని రైలు ఢీకొట్టడంతో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరొకరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.