1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2023 (14:20 IST)

Aadhaar Update.. మార్పులకు ఆరు రోజులే.. లేకుంటే చెల్లించాల్సిందే..

aadhar card
ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు ఉచితంగా చేసుకునేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఆధార్ కార్డ్ హోల్డర్లు ఇప్పుడు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఆన్‌లైన్‌లో కొన్ని అప్‌డేట్‌లను చేయవచ్చు. అయితే ఇది డిసెంబర్ 14 వరకు మాత్రమే సాధ్యమవుతుంది.
 
డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా పౌరులకు ఈ అవకాశం కల్పించారు. ఇప్పుడు myAadhaar పోర్టల్‌లో ఆధార్ సమాచారాన్ని ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. దీనిపై యూఐడీఏఐ గతంలో ట్వీట్ చేసింది.
 
 పౌరులు https://myaadhaar.uidai.gov.inలో ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌ను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌లోడ్ చేయడం ద్వారా ఆధార్‌ను తిరిగి ధృవీకరించవచ్చని సంస్థ ఒక ట్వీట్‌లో తెలిపింది. అయితే, ఉచిత సేవలను పొందడానికి గడువును చాలాసార్లు పొడిగించారు.
 
UIDAI సూచనలు
పదేళ్ల క్రితం ఆధార్‌ తీసుకున్న వారు నిర్దిష్టమైన పత్రాలను సమర్పించి వివరాలను అప్‌డేట్ చేయాలని యూఐడీఏఐ గతంలోనే స్పష్టం చేసింది. ప్రజలు తమ జనాభా వివరాలను అప్‌డేట్ చేస్తే, సేవలను త్వరగా, సులభంగా పంపిణీ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. డిసెంబర్ 14 వరకు myAadhaar పోర్టల్‌లో ఈ సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఆధార్ కేంద్రాల్లో ప్రక్రియను పూర్తి చేయడానికి కొంత మొత్తంలో రుసుము చెల్లించాలి.
 
* ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసే ప్రక్రియ కోసం ముందుగా Myaadhaar పోర్టల్ https://myaadhaar.uidai.gov.in/కి లాగిన్ చేయండి. పోర్టల్‌లోని ‘డాక్యుమెంట్ అప్‌డేట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. 
 
ఇక్కడ మీ ప్రస్తుత వివరాలు ప్రదర్శించబడతాయి.
ఇక్కడ మీ వివరాలను ఇక్కడ ధృవీకరించండి. 
మార్చవలసిన సమాచారాన్ని ఎంచుకోండి.
ఆధార్ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయండి
హైపర్‌లింక్‌కి దారి మళ్లిస్తుంది.
డ్రాప్‌డౌన్ మెను నుండి గుర్తింపు రుజువు, చిరునామా పత్రాల రుజువును ఎంచుకోండి.