సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 డిశెంబరు 2021 (15:03 IST)

చండీగఢ్ మున్సిపల్ పోల్‌లో ఆప్ ఘన విజయం

కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 35 మున్సిపల్ వార్డులకుగాను ఏకంగా 14 వార్డుల్లో ఇప్పటికే ఆప్ అభ్యర్థులు విజయభేరీ మోగించారు. కాంగ్రెస్ పార్టీ 8, బీజేపీ 12 వార్డులు, శిరోవణి అకాలీదళ్ ఒక వార్డులో గెలిచింది. 
 
కాగా, పంజాబ్, హర్యానా రాజధాని అయిన చండీగఢ్‌ మున్సిపల్ కార్పొరేషన్‌కు శుక్రవారం ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం చేపట్టారు. ఇందులో ఆప్ విజయభేరీ మోగించింది. 
 
కాగా, వచ్చేయేడాది జరుగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ కూడా ఒకటి. ఈ ఎన్నికల్లో విజయభేరీ మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఆప్ ఉంది. అందుకు తగిన విధంగా ఆప్ నేతలు పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నారు.