గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 జూన్ 2022 (08:07 IST)

దేశంలో "అగ్ని"జ్వాలలు - నేడు త్రివిధ దళాధిపతులతో ప్రధాని భేటీ

agniveers
సైన్యంలో సాయుధ బలగాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. విపక్ష పార్టీలతో పాటు నిరుద్యోగ యువత ఈ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందులోభాగంగా, బుధవారం భారత్ బంద్ కూడా నిర్వహించాయి. అయినప్పటికీ కేంద్రం మాత్రం అగ్గివీరుల నియామకంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెబుతోంది. పైగా, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. 
 
ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పథకంపై చర్చించేందుకు త్రివిధ దళాధిపతులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం సమావేశంకానున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో జరిగే యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. 
 
ఆ తర్వాత ఢిల్లీకి చేరుకుని త్రివిధ దళాధిపతులతో ఆయన సమావేశమవుతారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలంటూ పలు రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాల నుంచి డిమాండ్లు, ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ జరుపనున్న భేటీ అత్యంత కీలకంగా మారింది.