1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 ఏప్రియల్ 2021 (18:01 IST)

ఇదిగో ఈ శునకంలాగే ఎంజాయ్ చేస్తా : ఆనంద్ మహీంద్రా

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే పారిశ్రామికవేత్తల్లో ఒకరు ఆనంద్ మహీంద్రా. మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా గ్రూప్ ఛైర్మ‌న్. ఈయన సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. స‌మ‌కాలీన అంశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడూ స్పందిస్తూ ఉంటారు. 
 
అంతేకాదు అప్పుడ‌ప్పుడూ త‌న అభిప్రాయాల‌కు కాస్త ఫ‌న్‌ను కూడా జోడిస్తారు. తాజాగా క‌రోనా లాక్‌డౌన్ల‌పై ఆనంద్ మ‌హీంద్రా ట్విట‌ర్‌లో స్పందించారు. ఈ లాక్డౌన్‌లో, నైట్ క‌ర్ఫ్యూలతో జ‌నం విసిగిపోతున్నారు. ఇవ‌న్నీ ముగిసిపోయి సాధార‌ణ ప‌రిస్థితులు వ‌స్తే హాయిగా ఎంజాయ్ చేసేద్దామ‌ని చాలా మంది అనుకుంటున్నారు.
 
ఆనంద్ మ‌హీంద్రా కూడా అదే ప్లాన్‌లో ఉన్నారు. త‌న ట్విట‌ర్‌లో ఓ కుక్క వీడియోను షేర్ చేస్తూ ఒక్క‌సారి ఈ లాక్డౌన్లు పూర్త‌యితే తాను కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తానంటూ స‌ర‌దాగా ట్వీట్ చేశారు. 
 
"చాలా కాలం త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన సంతోషంతోనో మ‌రేంటోగానీ ఆ వీడియోలో ఆ కుక్క హాయిగా గెంతుతూ అటుఇటూ ప‌రుగులు తీయ‌డం చూడొచ్చు. చూస్తుంటే ఇది నా అవ‌తారంలాగే క‌నిపిస్తోంది. ఎందుకంటే ఒక్క‌సారి ఈ లాక్‌డౌన్లు ముగిసిపోతే నేను ఖచ్చితంగా ఇలాగే చేస్తాను" అని మ‌హీంద్రా ఆ ట్వీట్‌లో కామెంట్ చేశారు. 
 
దీనిపై నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు అయితే, దేశంలోనే దిగ్గజ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన ఆనంద్ మహీంద్రా ఇలాంటి ట్వీట్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.