గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఏప్రియల్ 2021 (22:28 IST)

ఇడ్లీ అమ్మకు ఇంటి పత్రాలు ఇచ్చిన మహీంద్రా గ్రూప్ ఛైర్మన్

త‌మిళ‌నాడులో కేవ‌లం రూ.1కే ఇడ్లీలు అమ్మిన వృద్ధురాలు అందరికీ గుర్తుండే వుంటుంది. ఆమెను అక్క‌డంద‌రూ ఇడ్లీ అమ్మ అని పిలుస్తారు. ఆమె అస‌లు పేరు కె.క‌మ‌ల‌త‌ల్‌. 2019 సెప్టెంబ‌ర్ నెల‌లో ఆమె గురించిన ఓ వీడియో వైర‌ల్ అయింది. 
 
ఆమె క‌ట్టెల పొయ్యి మీద ఇడ్లీలు చేస్తూ పేద‌లు, కూలీల‌కు కేవ‌లం రూ.1కే ఒక ఇడ్లీ అమ్మేది. ఆమె అలా 30 ఏళ్ల నుంచి ఇడ్లీల‌ను త‌యారు చేసి అందిస్తోంది. అయితే ఆమె వీడియో వైర‌ల్ అయ్యాక ఆమెకు స‌హ‌యం చేసేందుకు చాలా మంది ముందుకు వ‌చ్చారు.
 
ఇలా కమ‌ల‌త‌ల్ వీడియో వైర‌ల్ అయ్యాక మహీంద్రా గ్రూప్ చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా ఆమెకు ఎల్‌పీజీ క‌నెక్ష‌న్ ఇప్పించారు. అలాగే ఆమెకు ఇల్లు క‌ట్టిస్తాన‌ని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆయ‌న ఆమెకు తాజాగా ఇంటిని అంద‌జేశారు. ఆమె ఇంటి ప‌త్రాల‌ను అందుకుంది.

అప్ప‌ట్లో ఆమె త‌న‌కు ఓ ఇల్లు ఉంటే బాగుండున‌ని, దీంతో మ‌రింత మందికి ఇడ్లీల‌ను విక్ర‌యించేదాన్న‌ని చెప్పింది. ఆమె కోరిక తెలుసుకున్న ఆనంద్ మ‌హీంద్రా ఆమెకు ఇంటిని అంద‌జేశారు. ఆమెకు ఇంటిని అందించినందుకు గాను నెటిజ‌న్లు ఆనంద్ మ‌హీంద్రాను కొనియాడుతున్నారు.