శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 జనవరి 2024 (16:33 IST)

రాముడిపై చేనేత కార్మికుడి భక్తి-13 భాషలలో జైశ్రీరామ్ అని రామకోటి

Saree
Saree
రాముడిపై చేనేత కార్మికుడి భక్తిని ప్రదర్శించాడు. పట్టు వస్త్రంపై రామకోటి నామాలను మగ్గంపై నేసి తన భక్తిని చాటుకున్నాడు. రామాయణంలోని ముఖ్యమైన 400 ఘట్టాలను పట్టు వస్త్రానికి రెండు వైపులా పట్టుతో నేచి రామాయణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు. 
 
160 అడుగుల పొడవున్న ఈ పట్టు వస్త్రంలో 13 భాషలలో జైశ్రీరామ్ అని రామకోటి నామాన్ని నేశాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆ పట్టు వస్త్రాన్ని అయోధ్యలో రామ మందిరానికి అందించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. 
 
తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, ఒరిస్సా, గుజరాత్, బెంగాలీ ఇంగ్లీష్, పంజాబీ, భాషలతోపాటు రామాయణంలో లంకాదీశీడు రావణాసురుడు పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. దాదాపు నాలుగు నెలల పాటు నేసిన పట్టు వస్త్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 
 
అయోధ్య రామయ్యకు అపురూప వస్త్రం, పట్టు వస్త్రంపై రామకోటి, ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామ మందిరానికి అద్భుతమైన పట్టు వస్త్రాన్ని సత్యసాయి జిల్లా ధర్మవరంకి చెందిన చేనేత కళాకారుడు నేసాడు.