శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 జూన్ 2021 (17:45 IST)

చెన్నై వండలూరు జూలో కరోనాతో మగ సింహం మృతి

తమిళనాడు రాజధాని చెన్నైకి శివారులోని వండలూర్‌ అన్నా జూలాజికల్ పార్కులో మరో సింహం కరోనా మహమ్మారి బారినపడి మృతిచెందింది. జూలోని ఏసియాటిక్ మగ సింహం పద్మనాథన్ (12) గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడింది. పరిస్థితి విషమించడంతో బుధవారం ప్రాణాలు విడిచింది. దాంతో అరైనర్ అన్నా జూలాజికల్ పార్కులో కరోనా కారణంగా మృతిచెందిన సింహాల సంఖ్య రెండుకు చేరింది.
 
ఈ నెల 3న జూలోని నీలా (9) అనే ఆడ సింహం కరోనా బారినపడి మృతిచెందింది. అదేరోజు మిగతా సింహాలకు కూడా పరీక్షలు నిర్వహించగా మొత్తం తొమ్మిది సింహాలకు కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి వైద్యులు వాటికి ప్రత్యేకంగా చికిత్స అందజేస్తున్నారు. వాటిలో మూడు సింహాలు చికిత్సకు నిదానంగా స్పందిస్తున్నాయని జూ అధికారులు తెలిపారు. వాటిలోని ఒక సింహమే ఇప్పుడు వైరస్ ముదిరి మరణించింది.