శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 24 ఆగస్టు 2019 (12:53 IST)

బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కన్నుమూత

బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కన్నుమూశారు. కేంద్ర మాజీ మంత్రి అయిన అరుణ్ జైట్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్, మూత్రపిండాల రుగ్మతలతో బాధపడ్డ ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి.
 
శనివారం మధ్యాహ్నం 12.07 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు. ఈనెల 9వ తేదీని జైట్లీ ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యారని... సీనియర్ వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించిందని ఎయిమ్స్ యాజమాన్యం ప్రకటించింది. మరణించేనాటికి అరుణ్ జైట్లీకి 66 సంవత్సరాలు.