బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (11:13 IST)

మహానుభావుడు జగన్ వచ్చి.. 500 ఎకరాలు భోగాపురం..?

వైకాపాతో పాటు ఆ పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్‌పై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలు లేని దేశం ఉంటుందా.. దొంగలు లేని మతం చూసి ఉండరు.. తెలుగువారి ప్రత్యేకత ఏమిటంటే.. బెయిల్‌పై వచ్చిన వారిని, ముఖ్యమంత్రిని చెయ్యడమని జగన్‌కు చురకలు అంటించారు. వైసీపీ నేతలు ఏం పీకుతున్నారని ఓట్లు వేయాలని మండిపడ్డారు.
 
మహానుభావుడు జగన్ వచ్చి, 500 ఎకరాలు భోగాపురం ఎయిర్‌పోర్టులో సేవ్ చేశామని ప్రకటనలు చేశారు.. కానీ రైతుల భూములు తో వ్యాపారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఉత్తరాంధ్రలో, మౌలిక వసతులు తగ్గించి అభివృద్ధి చేస్తామంటూ నమ్మ గలమా.. విటిని లెక్కకడితే పుస్తకాలు రాయాలన్నారు. "భగవంతున్ని ఎప్పుడు ఏం కోరలేదు… పైడి తల్లి అమ్మని మాత్ర౦ ఇప్పుడు కొరతున్న.. ప్రభుత్వానికి మంచి బుద్ధి వచ్చేలా చూడు తల్లి" అంటూ ఆయన ఎద్దేవా చేశారు.