శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 23 డిశెంబరు 2018 (16:38 IST)

డాక్టర్లపై నమ్మకం లేదు.. యూట్యూబ్‌లో చూశాం.. మా బిడ్డకు మేమే ఆపరేషన్ చేసుకుంటాం..

వైద్యులపై తమకు ఏమాత్రం నమ్మకం లేదనీ, అందువల్ల తమ బిడ్డకు తామే ఆపరేషన్ చేసుకుంటామని ఓ జంట మొండిపట్టుపట్టారు. ఆపరేషన్ ఎలాచేయాలో యూట్యూబ్‌లో చేశామనీ అందువల్ల, ఒక నర్సుతో పాటు వైద్య పరికరాలను సమకూర్చితే సరిపోతుందని వారు కోరారు. ఆ జంట మాటలకు అవాక్కైన వైద్యులు బిడ్డ తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగారు. బెంగుళూరులో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగళూరు నగరానికి చెందిన ఓ యువజంట బిడ్డ అనారోగ్యం పాలయ్యాడు. దీంతో వారు నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పైగా, బాబుకు ఆపరేషన్ అవసరమని తల్లిదండ్రులే నిర్ధారించి.. తామే సర్జరీ చేసుకుంటామని.. ఒక నర్సు సహాయం చేస్తే సరిపోతుందని డాక్టర్లని  కోరారు. వీరి మాటలకు ఒక్కసారిగా వైద్యులతో పాటు ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు.
 
పైగా, 'మాకు డాక్టర్లపై నమ్మకం లేదు. మేము వారి ఫీజును భరించేస్థాయిలో లేము. యూట్యూబ్ లో వీడియో చూసాం. మాకు సర్జరీ చేయడం వచ్చు' అని పేషంట్ తల్లిదండ్రులు వైద్యులతో గొడవకు దిగారు. ఈ విషయం మెల్లగా మీడియాకు చేరింది. దీంతో మీడియా అంతా అక్కడకు చేరుకోవడంతో జరిగిన విషయాన్ని వైద్యులు వివరించారు. 
 
యూట్యూబ్‌లో చూసి ఆపరేషన్ చేస్తామనడం దారుణమని… ఇలాంటి చర్యలు సమాజానికి మంచివి కావని తెలిపారు. ట్రీట్మెంట్ చేయడానికి సర్టిఫైడ్ డాక్టర్ అవసరమన్నారు. ఎక్కడో ఓ చోట అధిక ఫీజు వసూలు చేస్తే.. అందరినీ అలాగే చూడటం సరికాదని మీడియాకు తెలిపారు.