మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (17:32 IST)

న్యాయమూర్తికి 59 ఏళ్లు.. మహిళా న్యాయవాదికి 50 ఏళ్లు.. డుం డుం డుం

Lawyer marriage
Lawyer marriage
దేశంలో పెను సంచలనం కలిగించిన దాణా కుంభకోణం కేసులో మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ శిక్ష విధించిన న్యాయమూర్తి శివపాల్ సింగ్ 59 ఏళ్ల వయస్సులో పెళ్లి కొడుకైనారు. రిటైర్ కాబోతున్న వయస్సులో 50 ఏళ్ల మహిళా న్యాయవాదిని రెండో వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  
 
జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాకు చెందిన జడ్జ్ శివపాల్ సింగ్ పదవీ విరమణకు ఆరు నెలల ముందు రోండో వివాహం చేసుకోవడం గమనించాల్సిన విషయం. తన స్నేహితురాలు, బీజేపీ నాయకురాలు అయిన 50 ఏళ్ల న్యాయవాది నూతన్ తివారీని శివపాల్ సింగ్ వివాహం చేసుకున్నారు. దాణా కుంభకోణం కేసులో లాలూకు శిక్ష విధించడంతో జడ్జ్ శివపాల్‌సింగ్ పేరు వెలుగులోకి వచ్చింది.
 
వృత్తిరీత్యా లాయర్ అయిన నూతన్ భర్త 2006లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. న్యాయమూర్తి శివపాల్ భార్య 20ఏళ్ల క్రితమే మరణించారు. శివ్‌పాల్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. నూతన్‌కు ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే వీరు వివాహం చేసుకున్నారు.