గురువారం, 23 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated: శుక్రవారం, 2 డిశెంబరు 2022 (12:44 IST)

ఆ శృంగార వీడియో వైరల్‌ను ఆపండి... ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

delhi high court
ఢిల్లీలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోను తక్షణం ఆపేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓ మహిళతో న్యాయాధికారి లైంగిక చర్యల్లో పాల్గొన్నట్లు గల వీడియో వైరల్ అవుతుండటాన్ని ఆపాలని కోర్టు పేర్కొంది. అలా ఆపని పక్షంలో ఫిర్యాదుదారుల గోప్యతా హక్కులకు భంగం వాటిల్లుతుందని కోర్టు తెలిపింది.  
 
కాగా 2022 మార్చి 9న చిత్రీకరించిన ఆ వీడియోలో వున్న ఓ వ్యక్తి దాఖలు చేసిన దావాను అత్యవసర పరిశీలనకు స్వీకరించి కోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. 
 
నవంబర్ 29 నుంచి ఈ శృంగార వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను తక్షణం ఆపాలని కోర్టు పేర్కొంటూ తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేసింది.