1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న సీబీఐ

cash seized
జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వాటర్ అండ్ పవర్ కన్సల్టింగ్ కంపెనీ (వాప్కోస్) మాజీ సీఈవో రాజేందర్ కుమార్ గుప్తాకు సంబంధించిని నివాసంలో మంగళవారం సీబీఐ అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. ఈయన ఒక్క నివాసంలోనే కాకుండా ఢిల్లీ, చండీగఢ్ సహా 19 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. 
 
ఈ దాడిలో రాజేందర్ కుమార్ గుప్తా, అతని కుటుంబ సభ్యులపై సీబీఐ కేసు నమోదు చేసి మంగళవారం రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. రాజేంద్ర కుమార్ గుప్తాపై గతంలో కూడా అనేక రాకలైన అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ అధికారులు సోదాలు జరిపి ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు.