మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2020 (10:14 IST)

చంద్రయాన్-3 సక్సెస్ కోసం ఇస్రో సన్నాహాలు.. సెప్టెంబర్ తొలి వారంలో?

భారత్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్‌-3ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. గతంలో చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సమయంలో ఎదురైన వైఫల్యాలను అధిగమించేందుకు కసరత్తులు ప్రారంభించింది.

ఇందుకు బెంగళూరు సమీపంలో చంద్రుడి ఉపరితలంపై ఉండే బిలాలను కృత్రిమంగా సృష్టించి, ల్యాండర్‌ను పరీక్షించనుంది. ఇందుకు బెంగళూరుకు 215 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెల్లాకేరేలోని ఉల్లార్తిలో కృత్రిమ బిలాలను సృష్టించనున్నారు. సుమారు రూ.24.2 వ్యయంత పదిమీటర్ల వ్యాసార్థం, మూడు మీటర్ల లోతుతో తవ్వకాలు చేపట్టనున్నారు.
 
ఇప్పటికే టెండర్లు సైతం ఆహ్వానించగా, ఆగస్ట్‌ చివరి నాటికి, సెప్టెంబర్‌ మొదటి వారంలో పనులు పూర్తి కానున్నాయి. చంద్రయాన్‌-2 మిషన్‌లో ఆర్బిటార్‌ విజయవంతంగా పని చేస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై దిగుతుండగా సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ప్రయోగంలో సెన్సార్ల పనితీరుపై ప్రధానంగా సారించి, పరీక్షలు చేస్తున్నారు. 
 
జాబిల్లి ఉపరితలంపై ల్యాండింగ్‌ ప్రదేశం ఎత్తుపల్లాలతో పాటు వేగాన్ని సెన్సార్లే సమన్వయం చేస్తాయి. దీంతో దీనిపై ప్రధానంగా దృష్టిపెట్టి సెన్సార్లు అమర్చిన ప్రత్యేక విమానాన్ని ఇస్రో ఉపయోగించి పనితీరును అంచనా వేయనుంది. ఏడు కిలోమీటర్ల ఎత్తు నుంచి ల్యాండింగ్‌ ప్రక్రియను సుమారు రెండు కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు సెన్సార్లు చేసే మార్గనిర్దేశాన్ని పరిశీలించనున్నారు.