గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2023 (10:28 IST)

చంద్రయాన్-3: కొత్త ఫోటోను విడుదల చేసిన ఇస్రో

ISRO
చంద్రుని దక్షిణ ధృవాన్ని అన్వేషించేందుకు ప్రయోగించిన చంద్రయాన్-3 తన 33 రోజుల చంద్ర యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుంది. చంద్రయాన్-3 వ్యోమనౌక ప్రణాళిక ప్రకారం 40 రోజుల ప్రయాణం తర్వాత 23వ తేదీ సాయంత్రం 5.47 గంటలకు చంద్రునిపై దిగుతుందని భావిస్తున్నారు. 
 
గురువారం ల్యాండర్ సెపరేషన్ ఈవెంట్ జరుగనుంది. అలాగే 23వ తేదీన చంద్రుని ల్యాండింగ్ కోసం భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. చంద్రయాన్-3 వ్యోమనౌక ఎత్తును 100 కిలోమీటర్లకు తగ్గించే పని ప్రారంభమైంది. 
 
ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 అంతరిక్ష నౌకలో ల్యాండర్ కెమెరా తీసిన కొత్త ఫోటోను ఇస్రో విడుదల చేసింది. ల్యాండర్ కెమెరా ద్వారా ఆగస్టు 9న తీసిన చంద్రుని ఫోటోను ఇస్రో విడుదల చేసింది. ఛాయాచిత్రాలను తీయడం ద్వారా ల్యాండర్‌పై కెమెరా పరీక్ష కూడా పూర్తయింది.