సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2023 (10:24 IST)

జాబిల్లిపై అడుగుపెట్టేందుకు అడుగు దూరంలో చంద్రయాన్

chandrayaan-3
జాబిల్లిపై అడుగుపెట్టేందుకు మరొక్క అడుగ దూరంలోనే ఉంది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్ జాబిల్లిపై ఈ నెల 23వ తేదీన దిగనుంది. ప్రస్తుతం చంద్ర కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్-3కి చివరి దశ కక్ష్య తగ్గించే ప్రక్రియను బెంగుళూరులోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రం నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం ఉదయం విజయవంతంగా నిర్వహించారు. 
 
దీంతో ఈ వ్యోమ నౌకకు కక్ష్య తగ్గింపు విన్యాసాలు పూర్తయ్యాయి. చంద్రయాన్-3 ప్రస్తుతం చంద్రుడి ఉపరితాలానికి 100 కి.మీ ఎత్తులో ఉన్న 153 కి.మీ (ఫెరిజి)-163 కి.మీ (అపోజి) కక్ష్యలోకి చేరింది. చంద్రుని చుట్టూ తిరిగేందుకు ఇదే చివరి కక్ష్య. ఈ కక్ష్యలో తిరుగుతుండగానే ప్రొపల్టన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్‌తో కూడిన ల్యాండర్ మాడ్యూల్‌ను వేరేచేసే ప్రక్రియను ఇస్రో గురువారం చేపట్టనుంది. 
 
చంద్రయాన్-3కి చివరి కక్ష్య తగ్గింపు ప్రక్రియను విజయవంతంగా చేపట్టామని, గురువారం ల్యాండర్ మాడ్యూల్‌ను వేరు చేసే ప్రక్రియ చేపడతామని ఇస్రో ట్వీట్ చేసింది. ఈ నెల 28న చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. చంద్రయాన్-3 ప్రయాణం సజావుగా సాగడంపై ఇస్రో మాజీ ఛైర్మన్ కె.శివన్ హర్షం వ్యక్తంచేశారు. దీనిలోని ల్యాండర్ ఈసారి చంద్రుని ఉపరితలంపై ఖచ్చితంగా దిగుతుందని చెప్పారు. ఈ ప్రయోగం తప్పకుండా విజయవంతం అవుతుందన్నారు.