గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2023 (10:48 IST)

హిందూ దేవుళ్లపై కామెంట్స్.. రిమాండ్ హోంకు 15 యేళ్ల విద్యార్థి

arrest
సోషల్ మీడియా వేదికగా హిందూ దేవుళ్లపై అసభ్యకర కామెంట్స్ చేస్తూ వచ్చిన 15 యేళ్ల విద్యార్థిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆ మైనర్‌ బాలుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ హోంకు పంపించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హిందూ దేవుళ్లపై సోషల్ మీడియాలో ఓ విద్యార్థి అనుచిత వ్యాఖ్యాలు చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో పదో తరగతి విద్యార్థిని నిర్బధించారు. ఈ విద్యార్థి చేసిన కామెంట్స్‌పై హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ విద్యార్థి చేసిన అనుచిత కామెంట్స్‌కు సంబంధించిన కామెంట్స్ స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. 
 
వీటిపై పలువురు బీజేపీ నేతలు, హిందూ సంస్థల ప్రతినిధులు ఇజాత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసి సదరు విద్యార్థిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకుని రిమాండ్ హోంకు తరలించారు.