శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 2 నవంబరు 2018 (20:37 IST)

చోరీకి వచ్చి బాలికపై గ్యాంగ్ రేప్.. ఎక్కడ?

ఇంట్లో చోరీ చేయడానికి వచ్చిన కొందరు దొంగలు.. చివరకు ఆ ఇంట్లో ఉన్న బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన ఈ దాడి వివరాలను పరిశీలిస్తే... 
 
ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లా కవి సూర్య నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధి దొయికొన గ్రామంలోని ఓ ఇంట్లోకి ముగ్గురు దుండగులు బుధవారం అర్థరాత్రి దొంగతనం కోసం వచ్చారు. దొరికిన సొమ్మును ఎత్తుకుపోవటంతోపాటు ఇంట్లో అమ్మ పక్కన నిదురిస్తున్న తొమ్మిదేళ్ల బాలికను అపహరించి, సామూహిక అత్యాచారానికి చేశారు. 
 
గురువారం తెల్లవారుజామున మేల్కొన్న బాలిక తల్లి.. కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళన చెంది.. భర్తను నిద్ర లేపింది. అప్పటికే ఇంట్లోని సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉంది. అల్మారాలో దాచిన రూ.20 వేల నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు దంపతులు గుర్తించారు. దొంగతనానికి వచ్చినవారే తమ కుమార్తెనూ ఎత్తుకుపోయి ఉంటారని అనుమానించి, ఇరుగుపొరుగు సాయంతో బాలిక కోసం గాలిస్తుండగా బాధితురాలు ఏడుస్తూ వచ్చింది. 
 
ముగ్గురు ముసుగు దొంగలు తనను ఎత్తుకుని గడ్డివాము చాటుకు తీసుకెళ్తుండగా, మెలకువ వచ్చిందని బాలిక పేర్కొంది. అరిస్తే చంపేస్తామని బెదిరించి దుండగులు అత్యాచారం చేశారని బాధితురాలు బోరున ఏడుస్తూ చెప్పింది. దీంతో బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... ముసుగు దొంగల కోసంగాలిస్తున్నారు.