సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 మే 2023 (10:58 IST)

డెలివరీ బాయ్ బైక్ ఎక్కిన రాహుల్ గాంధీ

Rahul Gandhi
Rahul Gandhi
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 10వ తేదీన జరగనున్నాయి. దీంతో పార్టీ నేతలంతా చివరి దశ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. బీజేపీ తరపున ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నట్టా, పలువురు మంత్రులు క్యాంపులు వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు.
 
అలాగే సోమవారం సాయంత్రానికి ప్రచారం ముగియనుండడంతో కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడే మకాం వేసింది. ఈ సందర్భంలో బెంగళూరులో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిచ్చి ఓట్లు సేకరించిన ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక్కసారిగా డెలివరీ బాయ్ బైక్ ఎక్కారు. 
 
ఆ తర్వాత జరిగిన ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. విద్వేష రాజకీయాల వల్ల మణిపూర్ రగిలిపోతోంది. ఈ విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా సంఘీభావ యాత్రకు శ్రీకారం చుట్టామన్నారు.