ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 సెప్టెంబరు 2024 (15:26 IST)

చుట్టూ వరదలు.. కారుపైన జంట.. రిలాక్స్‌గా 2 గంటలు (వీడియో)

Flood
Flood
గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లాలో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ జంట వరదల్లో చిక్కుకుంది. అయినా ఆ జంట రిలాక్స్‌గా కారుపై కూర్చుని సాయం కోసం అభ్యర్థించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
వరద ఉధృతి తక్కువగా ఉందని భావించి ఓ దంపతులు తమ కారుతో కాజ్‌వేను దాటే ప్రయత్నం చేశారు. అయితే, వరద ఉధృతి అధికంగా ఉండటంతో కారు నదిలో కొట్టుకుపోయింది. 
 
ఓ చోట రాళ్ల మధ్యలో చిక్కుకుపోవడంతో.. కారులో దింపతులిద్దరూ కారు టాప్‌ పైకి ఎక్కారు. దాదాపు రెండు గంటల పాటు కారు టాప్‌ పైనే బిక్కు బిక్కుమంటూ ఉండిపోయారు. కానీ భయపడలేదు. ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు సిద్ధం అయ్యారు. 
 
చివరికి సహాయక సిబ్బంది వారిని కాపాడారు. దీంతో హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దంపతుల ధైర్యాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు.